Breaking News

స్టార్‌ రేటింగ్‌ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?

Published on Mon, 06/23/2025 - 08:41

నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం స్టార్‌ రేటింగ్‌ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్‌ స్టార్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్‌ 
చేసుకోవాలా?     – రాజ్‌దీప్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌లో 3 స్టార్‌ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్‌ రేటింగ్‌ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్‌ రేటింగ్‌ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్‌ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్‌గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. 

ఇదీ చదవండి: ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?

రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్‌ లోడ్‌ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు.
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు