రూ.3,859.81 కోట్లు మొత్తం రుణం చెల్లించిన రాంకీ ఇన్‌ఫ్రా

Published on Tue, 07/15/2025 - 18:05

రుణదాతలతో పునర్నిర్మాణ నిష్క్రమణ ఒప్పందాన్ని (రీస్ట్రక్చరింగ్‌ ఎగ్జిట్‌ అగ్రిమెంట్‌) అమలు చేసిన అతి కొద్ది భారతీయ కంపెనీల్లో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. దాంతో తమ కార్పొరేట్ ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు చెప్పింది. జూన్ 12, 2015న టర్మ్ లోన్‌లు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రెండూ కలిపి మొత్తంగా రూ.3,859.81 కోట్ల రుణాన్ని  పునర్వ్యవస్థీకరణ ఒప్పందం (ఆర్ఏ) అమలులో భాగంగా పూర్తి చెల్లించాలని నిర్ణయించింది. దాంతో రీస్ట్రక్చర్‌ చేసిన టర్మ్ లోన్‌లను జూన్ 2019 నాటికి పూర్తిగా తిరిగి చెల్లించింది.

అనంతరం జులై 11, 2025న రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాని రుణదాతలకు అధికారికంగా ఆర్ఈఏను పూర్తిగా అమలు చేసినట్లు ప్రకటించింది. ఫలితంగా అన్ని వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలను ఇప్పుడు రుణదాతలు రెగ్యులర్, స్టాండర్డ్‌గా వర్గీకరించారు. ఇది కంపెనీ స్థిరమైన, మెరుగైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తుందని సంస్థ పేర్కొంది. ఎటువంటి టర్మ్‌లోన్లు పెండింగ్‌ లేకపోవడం, పునర్నిర్మాణ చట్రం నుంచి విజయవంతంగా నిష్క్రమించడంతో రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్రెడిట్ రేటింగ్‌లు, అంతర్గత బ్యాంక్ అసెస్‌మెంట్‌లను మెరుగుపరచుకుందని తెలిపింది. తద్వారా దాని మొత్తం ఆర్థిక ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకుంది.

ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు

రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ ఎండీ వై.ఆర్. నాగరాజా మాట్లాడుతూ..‘ఆర్‌ఈఏను అమలు చేయడం కంపెనీ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల మార్కెట్‌లో వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగించేందుకు తోడ్పాటు అందిస్తుంది’ అన్నారు.

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)