Breaking News

ఈసారి రాఖీ వ్యాపారం రూ. 12,000 కోట్లు!

Published on Sun, 08/18/2024 - 21:19

ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ సుమారు రూ. 12,000 కోట్ల వ్యాపారాన్ని ఆర్జించే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. చైనాలో తయారైన రాఖీలతో పోలిస్తే దేశీయ రాఖీలకు డిమాండ్ గణనీయంగా పెరగడం వ్యాపార వృద్ధికి ముఖ్యమైన కారణం.

రాఖీలకు పెరిగిన డిమాండ్‌తో గతేడాది జరిగిన రూ.10,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఈసారి పండుగ వ్యాపారం రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. అంటే గతేడాది కంటే 20 శాతం పెరుగుతుందన్న మాట. రాఖీల వ్యాపారం 2022లో రూ.7,000 కోట్లు కాగా, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ.5,000 కోట్లు, 2019లో రూ.3,500 కోట్లు, 2018లో రూ.3,000 కోట్లు.

ఇ‍ప్పుడు దేశంలోని నగరాల్లో వివిధ కళారూపాలను సూచించే స్థానికంగా తయారు చేసిన రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాగ్‌పూర్‌లో తయారైన ఖాదీ రాఖీలు , జైపూర్‌కు చెందిన సంగనేరి ఆర్ట్ రాఖీ, పుణె నుంచి విత్తన రాఖీ, మధ్యప్రదేశ్‌లోని సత్నా నుంచి ఉన్ని రాఖీ, గిరిజన వస్తువులతో చేసిన వెదురు రాఖీ, అస్సాంలో తయారు చేసిన టీ ఆకు రాఖీలు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని సీఏఐటీ అంచనా వేసింది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)