Breaking News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌

Published on Sat, 08/09/2025 - 12:51

పండుగ సీజన్ మొదలైపోయింది. పట్టణాల్లో ఉండేవారంతా.. సొంతూళ్లకు వెళ్ళడానికి సన్నద్ధమైపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వేస్ తన 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' కింద రిటర్న్ ఛార్జీలపై 20 తగ్గింపును ప్రవేశపెట్టింది. పండుగల సమయంలో రద్దీని నివారించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించినట్లు రైల్వే మంత్రి 'అశ్విని వైష్ణవ్' పేర్కొన్నారు. వెళ్ళడానికి, తిరిగి రావడానికి ఒకేసారి టికెట్స్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ.. టికెట్ బుకింగ్స్ వివరాలు
భారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద ఆగస్టు 14 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే వెళ్లేందుకు టికెట్ 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, తిరిగి రావడానికి టికెట్ 2025 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. వెళ్లేందుకు, తిరిగి రావడానికి బుక్ చేసుకునే టికెట్లలో పేరు, ఇతర వివరాలు ఒకేలా ఉండాలి. అప్పుడే 20 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..

రౌండ్ ట్రిప్ ప్యాకేజీ కింద ఒకే మోడ్‌ను (ఆన్‌లైన్ లేదా కౌంటర్ బుకింగ్) ఉపయోగించి.. వెళ్ళడానికి, తిరిగి రావడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు ఉండదు. అంతే కాకుండా డిస్కౌంట్ జర్నీ కూపన్స్, వోచర్ బుకింగ్స్ మొదలైన రాయితీలపైన టికెట్స్ బుక్ చేసుకోలేరు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)