Breaking News

అమెరికా సుంకాలు భారత్‌కు మేల్కొలుపు

Published on Thu, 08/28/2025 - 13:25

భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు బాధాకరమని, ఏ ఒక్క వాణిజ్య భాగస్వామిపైనా ఎక్కువగా ఆధారపడకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. భారత్‌కు ఇదో స్పష్టమైన మేల్కొలుపు అని హెచ్చరించారు. భారత వస్తువులపై యూఎస్‌ 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజన్‌ మాట్లాడారు.

వాణిజ్య సంబంధాలకు ఎదురుదెబ్బ

‘ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది. భారతదేశం కఠినమైన ఆర్థిక శిక్షలను ఎదుర్కొన్నప్పటికీ చైనా, యూరప్‌ వంటి రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై యూఎస్‌ ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు. ఇది యూఎస్‌ విదేశీ వాణిజ్య విధానంలో ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలను రేకెత్తిస్తోంది. అమెరికా భౌగోళిక రాజకీయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అన్నీ ఆయుధంగా మలుచుకుంటోంది’ అన్నారు.

రష్యా చమురు విధానం

‘భారత్‌ తన రష్యా ముడిచమురు దిగుమతులను కొనసాగించాలి. వాస్తవంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందో స్పష్టంగా తెలియజేయాలి. రిఫైనరీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ ఎగుమతిదారులు పెరిగిన టారిఫ్‌ ధరలు చెల్లించాల్సిందే. అందులో ప్రయోజనం పెద్దగా లేకపోతే ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించాలి’ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ రష్యా చమురు నుంచి భారత్ లాభపడుతోందని యూఎస్‌ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సహా అమెరికా అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యామ్నాయాలు అవసరం..

‘అమెరికా, చైనా సహా ఏదైనా ఒక దేశంపై భారత్‌ అతిగా ఆధారపడకూడదు. చైనా, జపాన్, అమెరికా లేదా ఎవరితోనైనా కలిసి పనిచేయాలి కానీ, వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. ప్రత్యామ్నాయాలు ఉండేలా చూసుకోవాలి. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయాలి. ప్రపంచ సరఫరా గొలుసులకు అనుగుణంగా దేశీయ పోటీతత్వాన్ని పెంచాలి. ఆచరణాత్మకంగా ఉన్న విభాగాల్లో స్వావలంబన సాధించాలి’ అని రాజన్‌ అన్నారు.

ఇదీ చదవండి: పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌.. యూఐడీఏఐ లేఖ

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)