ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
టెలికాం కంపెనీల నయా దోపిడీ.. రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
Published on Tue, 03/24/2026 - 16:28
సాధారణంగా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్ను బట్టి డేటా, టాక్టైమ్ వేరుగా ఉంటాయి. టాక్టైమ్ విషయం పక్కన పెడితే.. డేటా మాత్రం ఉపయోగించినా?, ఉపయోగించకపోయినా? రోజు పూర్తవగానే (అర్ధరాత్రి 12 తరువాత) డేటా ఎక్స్పైరీ అవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు డేటా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
రాఘవ్ చద్దా రాజ్యసభలో మొబైల్ డేటా వినియోగంపై ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. తన అభిప్రాయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వినియోగదారులకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు తమ డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు కలిగి ఉండాలి వాదించారు.
భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం చాలా అవసరం. కాబట్టి మొబైల్ డేటా వినియోగం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అయితే, టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని రాఘవ్ చద్దా సూచించారు.
ప్రస్తుతం చాలా కంపెనీలు రోజువారీ డేటా పరిమితులతో (1.0 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ వంటి) ప్లాన్లు అందిస్తున్నాయి. కానీ వినియోగదారు ఆ రోజు మొత్తం డేటాను ఉపయోగించకపోతే.. మిగిలిన డేటా రాత్రి 12 గంటలకు పూర్తిగా రద్దవుతుంది. అంటే.. వినియోగదారు తన డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది వినియోగదారుల పట్ల అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇతర సేవలతో పోలిస్తే ఈ పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టించామంటే అది పూర్తయ్యే వరకు ఉపయోగిస్తాం. విద్యుత్ ఎంత వినియోగిస్తారో.. దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తాము. కానీ కానీ మొబైల్ డేటా విషయంలో మాత్రం వినియోగించని డేటా కూడా కోల్పోతున్నాం. డబ్బు మాత్రం చెల్లించాలి. ఇది సరైన విధానం కాదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
డేటా రోల్ఓవర్పై రాఘవ్ చద్దా డిమాండ్
మిగిలిపోయిన రోజువారీ డేటాను వృధా చేయకుండా తర్వాతి రోజుకు బదిలీ (Rollover) చేయాలి
ఉపయోగించని డేటా విలువను తర్వాతి రీఛార్జ్ ప్లాన్లలో తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలి
మిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికం కంపెనీలు… pic.twitter.com/mjCA509IK5— greatandhra (@greatandhranews) March 23, 2026
పరిష్కార మార్గాలు
డేటా పూర్తిగా వినియోగించకపోతే.. మిగిలిన డేటాను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనికి మూడు పరిష్కార మార్గాలున్నాయని రాఘవ్ చద్దా వెల్లడించారు.
డేటా రోల్ఓవర్: ఒక రోజు వినియోగించని డేటా తరువాతి రోజు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇది వినియోగదారులకు న్యాయం చేస్తుంది.
డిస్కౌంట్ లేదా సర్దుబాటు: వినియోగదారులు తరచుగా తక్కువ డేటా వినియోగిస్తే, వారికి వచ్చే నెల రీచార్జ్లో తగ్గింపు ఇవ్వాలి.
డేటా బదిలీ: వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపే అవకాశం కల్పించాలి. డేటాను వినియోగదారుల డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి.
ఇదీ చదవండి: 26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!
Tags : 1