Breaking News

హైదరాబాద్‌లో క్విక్‌ కామర్స్‌ హ‌వా

Published on Fri, 04/11/2025 - 19:55

కిరాణా సరుకులు కావాలా? 10 నిమిషాల వ్యవధిలోనే ఇంటి వద్దకే వచ్చేస్తాయి! సొంత మొబైల్‌లోని క్విక్‌ కామర్స్‌ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన తరువాత నిమిషాలలోపే ఇంటికి అవసరమైన బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు వంటి కిరాణా సరుకులన్నీ వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ యాప్స్‌ ద్వారా క్విక్‌ కామర్స్‌ (త్వరిత వాణిజ్యం) దేశంలో ప్రస్తుతం 31.33 శాతం వార్షిక వృద్ధిరేటుతో వేగంగా విస్తరిస్తోంది. కాగా 2025–2030 మధ్య సంవత్సరానికి 44.9 శాతం వృద్ధి రేటుతో ఈ రంగం దూసుకుపోనుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో టెక్‌ జనం ఎక్కువ కావడంతో తెలంగాణలో  క్విక్‌ కామర్స్‌ (Quick Commerce) మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

బిగ్‌బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్, డంజో లాంటి సంస్థలు రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు మరిన్ని నగరాల్లో వినియోగదారుల ఇళ్లకే గ్రోసరీని తీసుకెళ్తూ ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా వేర్‌హౌజ్‌ ఏర్పాటు చేసుకొని ఈ–కామర్స్‌ వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్‌ సంస్థ ‘అమెజాన్‌ తేజ్‌’ పేరుతో క్విక్‌ కామర్స్‌ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ‘జెప్టో’ సంస్థ అత్యధిక వృద్ధిరేటుతో హైదరాబాద్‌ మార్కెట్‌ను ఆక్రమించుకుంటోంది. కాగా ‘అమెజాన్‌ తేజ్‌’ రంగంలోకి దిగితే పరిస్థితి ఆ సంస్థకు అనుకూలంగా మారుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కాగా రాష్ట్రంలో హైదరాబాద్‌లో మొదలైన క్విక్‌ కామర్స్‌ జోరు వరంగల్, కరీంనగర్‌ (Karimnagar) వంటి నగరాలకు కూడా  విస్తరిస్తోంది.  
– సాక్షి, హైదరాబాద్‌

ఎక్కడికక్కడ గోడౌన్‌లతో...
క్విక్‌ కామర్స్‌ అంటే కిరాణా సరుకులు, చిరుతిండ్లు, ఇంటి సామగ్రి కొన్ని నిమి షాల్లోనే వినియోగదారుని ఇంటికి చేర్చడ మే. తెలంగాణలో హైదరాబాద్‌ కేంద్రంగా భారీ ఎత్తున గోడౌన్‌లు ఏర్పాటు చేసుకొని బిగ్‌బాస్కెట్‌ (బీబీ నౌ), అమెజాన్‌ (తేజ్‌), జెప్టో, స్విగ్గీ (ఇన్‌స్టా మార్ట్‌), బ్లింకిట్, డంజో మొదలైన సంస్థలు క్విక్‌ కామర్స్‌ రంగంలో పనిచేస్తున్నాయి. బిగ్‌ బాస్కెట్‌ సంస్థకు హైదరాబాద్‌లో దాదాపు 400 వరకు చిన్న గిడ్డంగులు ఉండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉండే వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అమెజాన్‌ ఇప్పటికే 24 గంటల్లో సేవలు అందించేలా ఈ కామర్స్‌ (e Commerce) వ్యాపారంలో దూసుకుపోతుండగా, కొత్తగా హైదరాబాద్‌ కేంద్రంగా ‘తేజ్‌’ సేవలను ప్రారంభించ నుంది. తద్వారా కిరాణా, చిన్నస్థాయి విద్యుత్‌ సామగ్రి, పండ్లు వంటి వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. జెప్టో సంస్థ కిరాణా, చిరుతిండ్లు, సౌందర్య సామగ్రితో పాటు గృహావసరాలకు అవసరమైన అన్నింటినీ 10 నిమిషాల్లో సరఫరా చేసే హామీతో దూసుకుపోతుంది.

గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌ (Banjara hills) మొదలుకొని హైదరాబాద్‌ లోని అడ్డగుట్ట, పాతబస్తీ వంటి వందలాది ప్రాంతాల్లో గ్రోసరీ గోడౌన్‌లను ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తుంది. ఇక హోటళ్ల నుంచి ఆహారాన్ని వినియోగదారులకు అందించే సేవల్లో ఉన్న స్విగ్గీ కూడా క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టింది. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ పేరుతో కిరాణా, ఇంటి సామగ్రితో పాటు మెడికల్స్‌ను కూడా 15 నుంచి 20 నిమిషాల్లో సరఫరా చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లోనూ ఈ సంస్థ విస్తరించడం గమనార్హం. గ్రోఫర్స్‌ పేరుతో దశాబ్దం క్రితం ప్రారంభమై పేరు మార్చుకొని ‘బ్లింకిట్‌’గా సేవలందిస్తున్న మరో సంస్థ కూడా హైదరాబాద్‌లో జొమాటో సహకారంతో పెద్దఎత్తున గోడౌన్‌లను ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు సేవలు అందిస్తోంది. డంజో అనే మరో సంస్థ కూడా క్విక్‌ కామర్స్‌ రంగంలో హైదరాబాద్‌లో సేవలు అందిస్తోంది.

హైదరాబాద్‌లో క్విక్‌ కామర్స్‌ వాటా 10 శాతం 
2024 చివరి నాటికి భారతదేశంలో క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ విలువ సుమారు 5 బిలియన్‌ డాలర్లు. ఇది 2025 చివరి నాటి కి 6–7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో రిటైల్‌ మార్కెట్‌ (Retail Market) సుమారు రూ. 20,000 –25,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తే, క్విక్‌ కామర్స్‌ వాటా దాదాపు 8 నుంచి 10 శాతం ఉంటుంది. అంటే రూ. 8,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ వాటా యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కామర్స్‌ సంస్థలకు వచ్చే ఆర్డర్లు ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర వరకు ఉండొచ్చని అంచనా. వీటి విలువ రూ. 5 కోట్లకు పైనే ఉండొచ్చు. కాగా ఈ క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌లో కూడా బిగ్‌ బాస్కెట్‌ (Big Basket) సంస్థ ప్రధాన వాటాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చ‌ద‌వండి: మారిన త‌త్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఇవే

30 నుంచి 40 శాతం వాటా ఈ సంస్థకే ఉండగా, ఇప్పుడు జెప్టో, బ్లింకిట్‌ సంస్థలు పోటీ పడుతున్నాయి. జెప్టో 5 నుంచి 10 నిమిషాల్లో నిత్యా వసర వస్తువులు, కూరగాయలు, పండ్లతో పాటు వినియోగదారుడు కోరిన వస్తువులన్నింటినీ అందిస్తూ ఇప్పటికే 20 శాతం వాటాను సొంతం చేసుకొని మరింత వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు ఆఫర్లతో ఈ సంస్థ హైదరాబాద్‌లో క్విక్‌ కామర్స్‌ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది. అమెజాన్‌ (Amazon) సంస్థ ‘తేజ్‌’ ద్వారా క్విక్‌ కామర్స్‌ రంగంలో 20 శాతం వా టాను సొంతం చేసుకునే అవకాశం ఉంది. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, బ్లింకిట్, డంజో వంటి సంస్థల వాటా మరో 20 శాతం వరకు ఉంటుంది.

భవిష్యత్తులో చిన్న నగరాలకు విస్తరణ
తెలంగాణలో క్విక్‌ కామర్స్‌ రంగం మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌ లాంటి నగరాలతో పాటు హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న కొన్ని పట్టణాలకు కూడా ఈ సేవలు అందనున్నాయి. అమెజాన్‌ ‘తేజ్‌’ రాకతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. వేగం, నాణ్యత, తక్కువ ధరలు ఇచ్చే సంస్థలే ఈ రంగంలో పైచేయి సాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)