Breaking News

ఫారం 16: ఎన్నో ప్రశ్నలు.. అన్నింటికీ జవాబులు

Published on Mon, 08/11/2025 - 19:33

ఫారం 16. దీనికి సంబంధించి ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు.. అలాగే వాటికి జవాబులు ఇక్కడ తెలుకుందాం.

ఇదివరకే చాలాసార్లు దీనికి సమాధానం రాశాం. ముందుగా ఆదాయాన్ని లెక్కించండి. అంటే .. అందులో ఏయే అంశాలున్నాయనేది చూసుకోండి. ఉదాహరణకు వేతనమా? ఇంటి మీద అద్దె? వ్యాపారమా? ఉద్యోగం చేస్తున్నారా? క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉన్నాయా? ఇవన్నీ కాకుండా అదనంగా ఇంకా ఏమేమి ఆదాయాలు ఉన్నాయి, మొత్తంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఒక పద్ధతి ప్రకారం క్రమంగా వ్రాయండి. ఇలా చేయడానికి మీరు కాస్త కసరత్తు చేయాలి. జీతానికి సంబంధించిన వివరాలు, అలాగే పెన్షన్‌ వివరాలు.. ఒక ఏడాది కాలంలో యాజమాని లేదా ఉద్యోగం మారారా? మారితే ఫారం 16 ఇచ్చారా ? అందులో ఎంత జీతం చూపించారు. ఇద్దరూ చెరొకసారి స్టాండర్డ్‌ డిడక్షన్‌ ఇచ్చారా? అలా ఇవ్వకూడదు. అలాగే ఇద్దరూ బేసిక్‌ లిమిట్‌ పరిగణలోకి తీసుకున్నారా? అలా తీసుకోకూడదు.

చాలా మంది స్టాండర్డ్‌ డిడక్షన్‌ని, బేసిక్‌ లిమిట్‌ని రెండు చోట్ల తీసుకొని.. ఎక్కడా పన్ను భారం లేదు కదా అని మురిసిపోతుంటారు. తీరా రెండూ కలిపి లెక్కలు తీసి, పన్ను భారం వేసేసరికి షాక్‌ అవుతుంటారు. కొందరు యజమానులను, కన్సల్టెంట్లను తిట్టుకుని, ఇరుగు పొరుగుని సంప్రదించి ఎగవేతల వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని సంతోషపడినా.. మరొక దూరపు బంధువు జాగ్రత్తల జగన్నాధం అలాంటి ‘శషభిషలు’ పనికి రావు అని శాసిస్తే.. చివరికి సరైన దారిలోకి వస్తుంటారు.

అంటే రెండు చోట్లా డిడక్షన్లు క్లయిం చేస్తారు. యజమాని సహకారం, ఉదాసీనత, అరకొర జ్ఞానం, మిడిమిడి జ్ఞానం మొదలగు వాటి ముసుగులో హెచ్‌ఆర్‌ఏ విషయంలో దొంగ రశీదులు, ఎక్కువ చెల్లించినట్లు రశీదులు, చనిపోయిన మావగారింట్లో చూరుపట్టుకొని వేలాడుతూ ఇల్లరికం అల్లుడిలా చెలామణి అవుతూ, మావగారి సంతకంతో ఒక రశీదు పడేస్తారు.

ఆఫీసులో కొంతమంది ప్రబుద్ధులు, భార్యభర్తలు .. అద్దె చెల్లించకుండా, తండ్రి ఇంట్లో ఉచితంగా ఉంటూ, ఇద్దరూ హెచ్‌ఆర్‌ఏ విషయంలో క్లెయిం చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొందరు సొంత ఇంట్లోనే ఉంటూ, తన పేరు మీదే ఇల్లు ఉన్నా, గతంలో ఒక ఇల్లు/వాకిలి/స్థలం అమ్మేసిన సొమ్ము వస్తే, ఆ సంగతి ఆదాయపు పన్ను శాఖ వారికి చెప్పకుండా, అదృష్టం బాగుండి ఏ అప్పూ లేకుండా ఇల్లు పూర్తి చేస్తుంటారు. తన పేరు మీదే మున్సిపల్‌ ట్యాక్స్‌ చెల్లించినా కూడా హెచ్‌ఆర్‌ఏ సంగతి గుర్తుకు రాగానే, కంగుతిని, భార్యామణి చేత సంతకం పెట్టించి, ఆమెనే ఓనరుగా చూపించి హెచ్‌ఆర్‌ఏ క్లెయిం చేస్తుంటారు. అలాగే యజమాని సహకారం/ ప్రేమ/ జాలి / కరుణ గల ఉద్యోగ రత్నాలు తమకు వర్తించే అన్ని డిడక్షన్లు క్లెయిం చేస్తున్నారు. ఒక విధంగా దొంగ క్లెయిమ్‌లు చూపించి, వాటిని ఫారం 16లో పొందుపరిచి, వాటికి పవిత్రను ఆపాదించే ఉద్యోగ రాయుళ్లు ఉన్నారు.

ఇదీ చదవండి: ఫారం 16లో జరిగిన మార్పులు.. గమనించారా?

అందుకే కాబోలు...డిపార్ట్‌మెంట్‌ వారు కఠినంగా వ్యవహరించేందుకు సన్నద్ధులు అయ్యారు. ఆ యుద్ధం చేసే ముందు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. అదేమిటంటే ప్రతి డిడక్షన్‌ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ కాగితాలను జతపరచకపోయినా వాటిలోని వివరాలు చాలా ఇవ్వాలి. ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఇవ్వకపోతే క్లెయిమ్‌/డిడక్షన్‌ ఇవ్వరు. ఫారంలో వివరాలు ఇస్తే గనుక, రిటర్నులు దాఖలు చేయాలి. ఫారం 16 అంశాలు సమీక్షించి సరైన కాగితాలు సమకూర్చుకుని, సన్నద్ధం కండి.

ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)