Breaking News

మంచంలో సగం అద్దెకు.. ఆశ్చర్యపడే ఆదాయం సంపాదిస్తున్న మహిళ!

Published on Sat, 05/03/2025 - 19:27

అద్దెకు తీసుకోవడం అనే మాట వినిపిస్తే.. సాధారణంగా ఇల్లు, కారు, బైకు మొదలైనవి రెంటుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉపయోగించే మంచంలో సగం అద్దెకు తీసుకుంటారా?, ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే ఆలోచనతో ఓ మహిళ నెలకు రూ. 54,000 సంపాదిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ 'మోనిక్ జెరెమియా'.. "హాట్ బెడ్డింగ్" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లను (రూ.54,000) వసూలు చేస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది ఆమె ఆలోచన.

హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని జెరెమియా నమ్మింది. మీరు నాలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే.. మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే.. ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని చెబుతోంది.

2020 కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ కోల్పోయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ "హాట్ బెడ్డింగ్" ఆలోచన వచ్చింది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసినవాడేనని.. అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదని మోనిక్ జెరెమియా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నియమాలను గౌరవించుకుంటే.. ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లు, బెడ్ షేర్ చేసుకోవచ్చు అని అంటోంది. కష్ట సమయంలో.. డబ్బు సంపాదించడానికి హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని జెరెమియా చెబుతోంది.

ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)