Breaking News

విప్లవాత్మక ఆవిష్కరణ.. స్మార్ట్ ఏఐ నోట్‌బుక్‌

Published on Wed, 02/26/2025 - 21:17

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత, సుస్థిర సాంకేతిక పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న క్వాడ్రిక్ ఐటీ.. బయో ఏషియా 2025లో అద్భుతమైన ఆవిష్కరణలతో ప్రభావం చూపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సుస్థిరతతో మిళితం చేస్తూ రూపొందించిన పలు ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించింది.

రీయూజబుల్‌ స్మార్ట్ ఏఐ నోట్ బుక్
క్వాడ్రిక్ ఐటీ అందించిన అద్భుతమైన ఆవిష్కరణలలో రీయూజబుల్ స్మార్ట్ ఏఐ ఆధారిత నోట్ బుక్ ఒకటి. సుమన్ బాలబొమ్ము, కేసరి సాయికృష్ణ శబనివీసు, రఘు రామ్ తాతవర్తి కలిసి రూపొందించిన ఈ నోట్ బుక్ సమావేశాల్లో నోట్స్ తీసుకునే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నోట్ బుక్ సంప్రదాయ నోట్ బుక్ లాగే పనిచేస్తుంది. కానీ ప్రతి పేజీని 100 సార్లు పునర్వినియోగించుకోవచ్చు. రెనోట్ఏఐ అనువర్తనాన్ని ఉపయోగించి చేతిరాత కంటెంట్‌ను డిజిటల్ ఫార్మాట్లోకి సులభంగా మార్చవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్, ఏఐ-జనరేటెడ్ ప్రాంప్ట్‌ల ద్వారా సమాచారాన్ని కావాల్సినప్పుడు తిరిగి పొందవచ్చు. ఈ నోట్‌బుక్‌ పేజీలను తడి గుడ్డ లేదా టిష్యూతో తుడిచివేసి మళ్లీ ఉపయోగించవచ్చు. దీంతో కాగితం వినియోగం బాగా తగ్గుతుంది.

మరిన్ని ఏఐ పరిష్కారాలు
రీ యూజబుల్‌ స్మార్ట్ నోట్‌బుక్‌తో పాటు క్వాడ్రిక్ ఐటీ..  బయో, ఫార్మా పరిశ్రమల కోసం రూపొందించిన మరిన్ని కృత్రిమ మేధ, డేటా ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించింది. ఈ ఆవిష్కరణలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడతాయి. అలాగే పర్యావరణ హితానికి తోడ్పడతాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)