మల్టీప్లెక్స్‌ స్టాక్‌ పంట పండింది..?

Published on Mon, 03/17/2025 - 18:52

హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్‌ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌ ఐనాక్స్ సినిమాస్‌లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్‌ రేటింగ్‌ బ్రేకరేజ్‌ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్‌ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు  గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్‌ ఐనాక్స్‌ మంచి లాభాలు పోస్ట్‌ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్‌ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.

ఇదీ చదవండి: భారత్‌తో వాణిజ్యంపై యూఎస్‌ స్పై చీఫ్‌ స్పందన

కొత్తగా 100 స్క్రీన్లు..

పీవీఆర్‌ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)