Breaking News

నిపుణులమైనా నేర్చుకుంటాం..

Published on Thu, 10/03/2024 - 21:44

వృత్తిలో ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకుంటే వెనుకబడిపోతాం. రోజువారీ విధుల్లో నెగ్గుకురాలేం. ఈ ఆవశ్యకతను హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్‌ గుర్తించారు. పనిలో ముందుకెళ్లేందుకు తోడ్పాటు కోసం అన్వేషిస్తున్నారు.

ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్‌ఇన్ కొత్త పరిశోధన ప్రకారం, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 93 శాతం మంది ప్రొఫెషనల్స్‌ తమ వృత్తిలో ముందుకెళ్లేందుకు మరింత మార్గదర్శకత్వం, తోడ్పాటు కోసం చూస్తున్నారు. కొత్త కొత్త మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు తమ విధుల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మిలితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో 63 శాతం మంది తమ కెరీర్‌లో ముందుకు సాగడం కోసం ఏఐపై ఆధారపడటం సౌకర్యంగా ఉంటుందని నమ్ముతున్నారు.

ఫలితంగా ఏఐ ఆప్టిట్యూడ్‌తో కూడిన లింక్డ్‌ఇన్ లెర్నింగ్ కోర్సుల వినియోగం గత సంవత్సరంలో నాన్-టెక్నికల్ ప్రొఫెషనల్స్‌లో 117 శాతం పెరిగింది. అనుభవం ఒక్కటే సరిపోదని నిపుణులు గుర్తిస్తున్నారు. నగరంలోని 69 శాతం మంది ప్రొఫెషనల్స్‌ నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. 41 శాతం మంది కెరీర్ వృద్ధికి నైపుణ్యం అవసరమని నమ్ముతున్నారు. వర్క్‌ ప్లేస్‌ మార్పును ఎదుర్కొంనేందుకు 60 శాతం మంది అవసరమైన నైపుణ్యాలపై మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు.

ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?

చాలా మంది సాంకేతిక పురోగతి (51 శాతం), సెక్టార్-నిర్దిష్ట మార్కెట్ విశ్లేషణ (42 శాతం), సామాజిక పోకడలు (34 శాతం) గురించి తెలుసుకొని భవిష్యత్తు అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారు. విషయ పరిజ్ఞానం కోసం హైదరాబాద్‌లోని 46 శాతం మంది నిపుణులు షార్ట్-ఫామ్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు. 45 శాతం మంది నిర్దిష్ట నైపుణ్యాలను అందించే లాంగ్‌-ఫామ్‌ వీడియో కోర్సులను అత్యంత సహాయకరంగా భావిస్తున్నారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)