Breaking News

బంగ్లా అమ్మేసిన ప్రియాంక చోప్రా ఫ్యామిలీ

Published on Thu, 11/12/2026 - 13:53

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కుటుంబం రియల్ ఎస్టేట్ రంగంలో భారీ లావాదేవీని పూర్తి చేసింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా, తమ్ముడు సిద్దార్థ్‌ చోప్రా తమకు చెందిన కోరేగావ్ పార్క్ ప్రాంతంలోని ఖరీదైన లగ్జరీ బంగ్లాను విక్రయించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సురోజ్ బిల్డ్‌కాన్ సంస్థకు ఈ ప్రాపర్టీని రూ.6.5 కోట్ల భారీ ధరకు విక్రయించినట్లు అధికారిక డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి.

ఆస్తి వివరాలు.. విస్తీర్ణం

పుణెలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో  ఒకటైన కోరేగావ్ పార్క్‌లోని నార్త్ మెయిన్ రోడ్డులో గల లిబర్టీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ఈ బంగ్లా ఉంది. ఈ ప్రాపర్టీ మొత్తం 3,754 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ బిల్ట్ అప్ ఏరియా 2,180 చదరపు అడుగులు కాగా, 950 చదరపు అడుగుల బేస్‌మెంట్, అదనంగా 2,232 చదరపు అడుగుల విశాలమైన గార్డెన్ స్పేస్ ఉంది. వీటితో పాటు వాహనాల నిమిత్తం 400 చదరపు అడుగుల ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కూడా ఈ డీల్ కలిగి ఉంది. ఈ లావాదేవీకి సంబంధించి భారీ మొత్తంలో స్టాంప్ డ్యూటీ కింద రూ.45.5 లక్షలు చెల్లించగా, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో రూ.30,000 చెల్లించినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

గతంలో అద్దె ఆదాయం

ఈ బంగ్లాను విక్రయించడానికి ముందే చోప్రా కుటుంబం దీని ద్వారా స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించింది. 2017 ఆగస్టులో సుమారు రూ.5.6 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీని గతంలో వివిధ సంస్థలకు లీజుకు ఇస్తూ వచ్చారు. కో-వర్కింగ్ సంస్థలతో పాటు పలువురికి దీన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి లాభాలను గడించారు. ముఖ్యంగా, గతంలో ఈ ఆస్తి ద్వారా నెలకు లక్షల్లో అద్దెలు అందుకుంటూ ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1.5 కోట్ల వరకు అద్దె రూపేణా ఆదాయాన్ని టార్గెట్ చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే, కేవలం పుణెలోనే కాకుండా ముంబై ప్రధాన నగరంలోనూ చోప్రా ఫ్యామిలీ తమ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను క్రమంగా మారుస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే గతంలో ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ‘ఒబెరాయ్ స్కై గార్డెన్స్’ ప్రాజెక్ట్‌లోని పలు లగ్జరీ ఫ్లాట్లను కూడా వారు భారీ ధరకు విక్రయించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)