Breaking News

రూ.5.6 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈవో.. ఎవరీ ప్రియా నాయర్?

Published on Thu, 07/10/2025 - 20:58

హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రియా నాయర్ నియమితులయ్యారు. ఆగస్టు 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నట్లు హెచ్‌యూఎల్‌ ప్రకటించింది. ఐదేళ్ల కాలానికి ఆమె నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం యూనిలీవర్ లో బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ విభాగానికి బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ సేవలందిస్తున్న నాయర్ ప్రపంచ మార్కెట్లలో 13 బిలియన్ యూరోల పోర్ట్ ఫోలియోను పర్యవేక్షిస్తున్నారు. జూలై 31న పదవి నుండి వైదొలగనున్న రోహిత్ జావా స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. 2023లో హెచ్‌యూఎల్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జావా.. యూనిలీవర్‌లో 37 ఏళ్ల విశిష్ట కెరీర్‌ను ముగించి బోర్డుతో పరస్పర ఒప్పందం తర్వాత వైదొలగుతున్నారు.

ఎన్నో బ్రాండ్లు..

దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రియా నాయర్‌ హెచ్‌యూఎల్ లో అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ హోమ్ కేర్ అలాగే బ్యూటీ & పర్సనల్ కేర్ కూడా ఉన్నాయి. అక్కడ ఆమె డవ్, రిన్, కంఫర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ బ్రాండ్ల వృద్ధికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ అండ్‌ బ్రాండ్ పరివర్తన వ్యూహాలను నడిపిస్తూ, బ్యూటీ & వెల్‌బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.

ఇక నాయర్‌ విద్యార్హతల విషయానికి వస్తే.. సిడెన్హామ్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె పుణెలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశారు. హిందూస్తాన్‌ యూనిలీవర్‌ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ రూ.5.6 లక్షల కోట్లుగా ఉంది.

హెచ్‌యూఎల్ గ్లోబల్ సీఎంఓగా నాయర్ సాధించిన విజయాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఆమె సోషల్-ఫస్ట్ మార్కెటింగ్ విధానాలను రూపొందించిందని, ప్రభావశీల-ఆధారిత ఆవిష్కరణలను విస్తరించిందని చెప్పుకొచ్చింది. యువ, డిజిటల్ అవగాహన ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి యూనిలీవర్ బ్యూటీ బ్రాండ్లను పునర్నిర్మించే లక్ష్యంతో గ్లోబల్ ప్రచారాలను ప్రారంభించిందని పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)