Breaking News

తగ్గిన పీఈ పెట్టుబడులు

Published on Tue, 06/20/2023 - 04:29

ముంబై: భారత్‌లోకి ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల ప్రవాహం మే నెలలో తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే గత నెలలో 44 శాతం, ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 52 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. 3.5 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2022 మే నెలలో ఇవి 6.2 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమ లాబీ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

చాలా మటుకు ఫండ్స్‌ గత ఏడాదిన్నరగా పుష్కలంగా నిధులు సమీకరించినప్పటికీ వాటిని ఇన్వెస్ట్‌ చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని ఈవై పార్ట్‌నర్‌ వివేక్‌ సోని తెలిపారు. వృద్ధి, మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత పోర్ట్‌ఫోలియో కంపెనీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. పెట్టుబడులపరంగా టెక్‌ రంగంలో కాస్త స్తబ్దత నెలకొందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆరి్థక సేవల విభాగాల్లోకి కాస్త పెట్టుబడులు వచి్చనట్లు సోని వివరించారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే పెట్టుబడుల ప్రవాహం ఆశావహంగానే కనిపిస్తోందని, 2023లో మొత్తం పెట్టుబడులు గతేడాది కన్నా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

నివేదికలోని మరిన్ని విశేషాలు..
► మే నెలలో మొత్తం 71 లావాదేవీలు జరిగాయి. గతేడాది మే నెలతో పోలిస్తే 42 శాతం తగ్గాయి.
► వృద్ధి దశలోని సంస్థల్లో పెట్టుబడులు 4 శాతం తగ్గాయి. 17 డీల్స్‌ కుదరగా 1.9 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 2022 మే లో 19 ఒప్పందాలు కుదరగా, 2 బిలియన ్డాలర్లు వచ్చాయి.  
► రియల్‌ ఎస్టేట్‌పై ఫండ్స్‌ అత్యధికంగా ఆసక్తి చూపాయి. ఏడు డీల్స్‌ ద్వారా 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2022 మే నెలలో 12 డీల్స్‌ ద్వారా 1.1 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. 864 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 15 డీల్స్‌తో టెక్నాలజీ రంగం రెండో స్థానంలో నిల్చింది. ఈ రంగంలో పెట్టుబడులు 159 శాతం పెరిగాయి.  
► ఫండ్స్‌ గతేడాది మేలో 745 మిలియన్‌ డాలర్లు సమీకరించగా.. ఈసారి 2.2 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)