Breaking News

ప్రైవేటు మూలధన వ్యయాలకు పుష్‌

Published on Wed, 09/10/2025 - 08:49

స్థిరమైన డిమాండ్‌ ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణనిస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. ప్రభుత్వ మూలధన వ్యయాలు బలంగా ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ రిఫైనరీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. ఎస్‌బీఐ రుణ పుస్తకంలో రూ.3–4 లక్షల కోట్లు కార్పొరేట్లవి ఉన్నట్టు చెప్పారు. రిఫైనరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన కంపెనీల నుంచి రుణాలకు డిమాండ్‌  ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. స్టీల్, సిమెంట్‌ కంపెనీలు ఇంకా పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు.

‘స్థిరమైన డిమాండ్‌ రాక కోసం ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు డిమాండ్‌కు ఊతమిస్తాయి. లిక్విడిటీ తగినంత ఉండేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గించింది. ఇవన్నీ కార్పొరేట్లలో (కంపెనీల్లో) విశ్వాసాన్ని పెంచుతాయి’ అని శెట్టి వివరించారు. కంపెనీలు ఇప్పటికే తమ సామర్థ్యంలో 75 శాతం వినియోగ స్థాయికి చేరుకున్నాయంటూ, సామర్థ్య విస్తరణ చేపట్టేందుకు ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. 

అంతర్జాతీయ రుణదాతల మాదిరే విలీనాలు, కొనుగోళ్లకు నిధులు సమకూర్చే దిశగా బ్యాంక్‌లను సైతం అనుమతించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కొనుగోళ్లు అన్నవి పారదర్శకతతో కూడిన లావాదేవీలుగా పేర్కొన్నారు. కనుక వీటికి రుణాల రూపంలో మద్దతుగా నిలిచేందుకు బ్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో యోనో యాప్‌ లిస్టింగ్‌ ఆలోచనేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)