Breaking News

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

Published on Fri, 08/01/2025 - 13:24

రక్షాబంధన్‌కు ముందు ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ  గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి.  కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది.  వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ కొత్త రేట్లు

ఢిల్లీ: రూ.1,631.50

కోల్‌కతా: రూ.1734.50

ముంబై: రూ.1582.50

చెన్నై: రూ.1789

హైదరాబాద్‌: రూ.1,886.50

డొమెస్టిక్ సిలిండర్‌ ధరలు
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)