Breaking News

విదేశీ కంపెనీలకూ ప్రిజంప్టివ్‌ పన్ను పథకం

Published on Sat, 10/04/2025 - 08:43

విదేశీ కంపెనీలకు సైతం ప్రిజంప్టివ్‌ పన్ను పథకాన్ని ప్రవేశపెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ కీలక సూచన చేసింది. దీనివల్ల సులభత్వం, స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. శాశ్వత ఏర్పాటుకు సంబంధించి వివాదాలకు ఐచ్ఛిక ప్రిజంప్టివ్‌ పన్ను విధానం ముగింపు పలుకుతుందని అభిప్రాయపడింది. ప్రిజంప్టివ్‌ పన్ను పథకం కింద.. కంపెనీల వాస్తవ లాభాలు, వ్యయాలతో సంబంధం లేకుండా స్థిర, ముందస్తుగా నిర్ణయించిన రేటుపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కంపెనీలపై నిబంధన అమలు భారం తగ్గుతుంది.

అకౌంట్‌ పుస్తకాలను నిర్వహించే భారం ఉండదు. విదేశీ కంపెనీలకు సైతం దీన్ని అమలు చేయడం వల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందన్నది నీతి ఆయోగ్‌ అభిప్రాయం. దీర్ఘకాలిక సమస్యకు ఇది ఆచరణాత్మక పరిష్కారం కాగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా వ్యాపార సూచీల్లో భారత్‌ స్థానం మెరుగుపడుతుందని పేర్కొంది. 

ఈ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘స్థిరమైన, స్పష్టమైన, ఊహించతగిన పన్ను విధానం అన్నది పెట్టుడులకు, ఆర్థిక వృద్ధికి ఎంతో అవసరం. పెట్టుబడిదారులకు లేదా వ్యాపారాలకు అనిశ్చితి అన్నది ఎంత మాత్రం మంచిది కాదు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా అవతరించాలన్నది లక్ష్యం. ఇందుకు గాను వేగంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ప్రజలకు తగినన్ని ఉపాధి అవకాశాలు చూపించాలి. వీటన్నింటికీ పెట్టుబడులు, ఊహాత్మక వ్యాపార వాతావరణం అవసరం’అని సుబ్రమణ్యం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)