Breaking News

మరో ఫ్లాట్‌ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published on Fri, 03/06/2026 - 18:27

బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న తన ప్లాట్‌ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.

ప్రీతి జింటా 2025 నవంబర్‌లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్‌ విక్రయించడం విశేషం.

ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్‌కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.

సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.

ఇదీ చదవండి: ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్‌' విలన్‌

నవంబర్‌లో విక్రయించిన ప్లాట్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)