Breaking News

భార్యతో కలిసి ఇన్వెస్ట్‌ చేసే పోస్టాఫీసు ప్రత్యేక స్కీమ్‌..

Published on Thu, 08/28/2025 - 19:17

అసలుకు ఎటువంటి రిస్క్‌ లేకుండా మంచి రాబడినిచ్చే పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో ఎన్నో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది రెపో రేటును 1 శాతం తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా కోతలు విధించింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై వడ్డీని బ్యాంకులు తగ్గించాయి. కానీ పోస్టాఫీసుల్లో పథకాల వడ్డీ రేట్లు మాత్రం మారలేదు.

సురక్షితమైన పెట్టుబడితో ప్రతి నెలా స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం ఉంది. అదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్) ఈ పథకంలో ఒకసారి ఏకమొత్తంలో మొత్తంలో పెట్టుబడి పెడితే దానిపై వడ్డీ ప్రతి నెలా వారి పొదుపు ఖాతాలో నేరుగా జమవుతుంది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు మొత్తం తిరిగి లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్‌ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ ద్వారా అయితే రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

వడ్డీ ఎంత వస్తుందంటే..
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 7.4% వార్షిక వడ్డీని (ఆగస్టు 2025 నాటికి) అందిస్తుంది. పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ప్రతి నెలా గ్యారెంటీ వడ్డీని ఇస్తుంది. ఉదాహరణకు భార్యభర్తలిద్దరూ కలిసి ఉమ్మడి ఖాతాలో రూ .15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా సుమారు రూ .9,250 వడ్డీ వస్తుంది. ఈ పథకం ప్రత్యేకమైనది ఎందుకంటే దాని వడ్డీ రేటు స్థిరంగా, బ్యాంకు కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందడం వల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది.

Videos

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

Photos

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)