Breaking News

క్లోజ్‌ అవుతున్న పోస్టాఫీస్‌ స్కీమ్..

Published on Mon, 03/17/2025 - 11:43

ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది.  అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్‌సీ) పథకం ఒకటి.

మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్‌సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

మహిళలకు ప్రత్యేకం
స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్‌సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్‌ స్కీమ్‌. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

ఎంత వడ్డీ లభిస్తుంది?
దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్‌సీ స్కీమ్‌పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.

పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్‌ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్‌ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు.

Videos

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)