Breaking News

ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

Published on Thu, 01/22/2026 - 16:33

ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అంచనా వేయలేరు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోవచ్చు, కరెన్సీ విలువ అమాంతం తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ తరుణంలో పోలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్ధిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు అయిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్.. మరో 150 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం పోలాండ్ వద్ద ఉన్న బంగారం నిల్వల పరిమితిని 550 టన్నులకు చేరింది. 2026 డిసెంబర్ 31 నాటికి దీనిని 700 టన్నులకు పెంచాలని సెంట్రల్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరుతున్నట్లు గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్‌కీ గత వారం ప్రకటించారు.

పోలాండ్ వద్ద ఉన్న బంగారం.. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందని సమాచారం. గోల్డ్ అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక దేశాన్ని ఆర్థికంగా రక్షించే కవచం అని ఆడమ్ గ్లాపిన్స్‌కీ పేర్కొన్నారు. పసిడి విలువ ఎప్పటికీ దాదాపు పడిపోయే అవకాశం లేదు. ఆర్ధిక అస్థిరత్వం లేదా ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని. ఇతర దేశాల ద్రవ్య విధానంతో సంబంధం లేకుండా.. ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.

విదేశీ మారక నిల్వల్లో పోలాండ్ వాటా 2024 నాటికి 16.86 శాతంగా ఉండేది. 2025 నాటికి ఇది 28.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి బంగారం పోగు చేసుకోవాలనే ఉద్దేశం ఒక్క పోలాండ్ దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరలు ఇలా..
భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు (గురువారం) రూ.1,54,310 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,450 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా.

ఇదీ చదవండి: బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్!

Videos

విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..

RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం

బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు

కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

నువ్వు నాటిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా బాబుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు

కేటీఆర్ కు సిట్ నోటీసులు

విద్యుత్ చార్జీలు తగ్గించినట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం

ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు

Photos

+5

వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)

+5

స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)

+5

నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)