Breaking News

మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..

Published on Tue, 05/09/2023 - 21:43

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) భారతీయ మార్కెట్లో ఎఫ్ సిరీస్‍లో తన పవర్‌ఫుల్ మొబైల్‍ను 'ఎఫ్5 5జీ' లాంచ్ చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ. 33,999. ఇవి మే 16 నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం.

మార్కెట్లో విడుదలైన కొత్త పోకో ఎఫ్5 5జీ కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లే కలిగి, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్‍డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ ఉంది.

ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.

(ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!)

కొత్త పోకో ఎఫ్5 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ టర్బో ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం 45 నిముషాలు మాత్రమే పడుతుంది. అదే సమయంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉంటాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్‍లో ఉంటాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)