Breaking News

ఆర్థికాభివృద్ధి ప్రాధాన్యత కావాలి!: ప్రధాని మోదీ

Published on Tue, 04/02/2024 - 00:56

ముంబై: ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, విశ్వాసాన్ని పెంపొందించడంసహా వచ్చే దశాబ్ద కాలంలో దేశాభివృద్ధే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రధాన ప్రాధాన్యత కావాలని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఆర్‌బీఐ 90 సంవత్సరాల స్మారకోత్సవ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన సందర్భంగా మోదీ ప్రసంగించారు.  భారత్‌ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే దశాబ్దం ఎంత ముఖ్యమో, ఆర్‌బీఐ 2035 నాటికి 100 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్వావలంభన, అంతర్జాతీయంగా రూపాయికి మరింత ఆమోదయోగ్యత వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రధానికి ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఒక జ్ఞాపికను అందజేశారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి మూలస్తంభంగా పనిచేసే స్థిరమైన, బలమైన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని గవర్నర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్‌బీఐ అపార అనుభవం,  నైపుణ్యతలు అంతర్జాతీయ అనిశ్చితులను ఎదుర్కొనడంలో దోహదపడిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కార్యక్రమంలో పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ రమేష్‌ బెయిన్స్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్, పంకజ్‌ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)