Breaking News

రేపు ఆర్థికవేత్తలతో మోదీ సమావేశం.. ఎందుకంటే?

Published on Tue, 07/09/2024 - 20:48

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో గురువారం సమావేశమవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రధానమంత్రి సమావేశానికి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా హాజరుకానున్నారు. కాగా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మోదీ3.0 మొదటి బడ్జెట్. ఇందులో ప్రధానంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గత నెలలో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, సంస్కరణల వేగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలతో ముందుకు వస్తుందని సూచించారు. ప్రభుత్వం విధానాలు భవిష్యత్తు దృష్టికి బడ్జెట్ సమర్థవంతమైన పత్రంగా ఉంటుందని అన్నారు.

నిర్మల సీతారామన్ ఇప్పటికే రాబోయే బడ్జెట్‌పై ఆర్థికవేత్తలు, భారతీయ పరిశ్రమలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపారు. ఇందులో  పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ.. వినియోగాన్ని పెంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలతో ముందుకు రావడానికి సామాన్యులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)