Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
రాష్ట్రాలు సకాలంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి
Published on Wed, 11/12/2025 - 08:51
రాష్ట్ర ప్రభుత్వాలు పలు పరిశ్రమలకు హామీ ఇచ్చిన మేరకు ప్రోత్సాహకాలను సకాలంలో మంజూరు చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ కోరారు. కొన్ని రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ప్రకటించి, వాటిని సకాలంలో ఇవ్వకపోవడం పట్ల పలు రంగాల నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు చెప్పారు.
కార్మికులు, దుకాణాలు/వాణిజ్య సంస్థలకు సంబంధించిన చట్టాలను సరళతరం చేయాలని కోరారు. తద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించొచ్చన్నారు. రాష్ట్రాల వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులను ఉద్దేశించి మంత్రి గోయల్ మాట్లాడారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, సుస్థిర విధానాలను పాటించే దిశగా పరిశ్రమలకు అవగాహన కల్పించాలని సూచించారు. నాణ్యత నియంత్రణ చట్టాలను అనుసరించాల్సిన ప్రాధాన్యతను గుర్తు చేశారు.
వైద్య చికిత్సల కోసం వీసా ఆన్ అరైవల్
యూఎస్, యూరప్ దేశాల నుంచి వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే వారికి వెంటనే వీసా మంజూరు (వీసా ఆన్ అరైవల్)ను పరిశీలిస్తున్నట్టు మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇదొక మంచి ఆలోచన అని సీఐఐ వార్షిక కార్యక్రమంలో భాగంగా పేర్కొ న్నారు. ఇప్పటికే పలు దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ప్రపంచ స్థాయి రేటింగ్ వ్యవస్థ
2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా మనకంటూ బలమైన, విశ్వసనీయమైన, ప్రపంచ స్థాయి రేటింగ్ సంస్థ ఉండాలన్నది తమ లక్ష్యమని మంత్రి గోయల్ చెప్పారు. వృద్ధి క్రమంలో రేటింగ్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!
Tags : 1