Breaking News

భారత్‌–అమెరికా చర్చల్లో పురోగతి

Published on Fri, 09/12/2025 - 08:53

ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్‌–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. 

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్‌ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్‌ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్‌ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.

రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.

అమెరికా, భారత్‌ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్‌–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.

ఇదీ చదవండి: నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు కొత్త ఫోన్‌
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)