Breaking News

టీడీఎస్‌ వ్యవస్థ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్‌

Published on Fri, 12/27/2024 - 10:54

న్యూఢిల్లీ: ట్యాక్స్‌ డిడక్షన్‌ యట్‌ సోర్స్‌ (TDS) వ్యవస్థను ‘ఏకపక్షం, అసంబద్ధమైనది’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(PIL) దాఖలైంది. సమానత్వంసహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా పేర్కొంటూ టీడీఎస్‌ను రద్దు చేయాలని పిటిషనర్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

మూలం వద్దే పన్నును మినహాయించడం, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్‌ చేయడం తగిన విధానం కాదని పిటిషన్‌ వివరించింది. అశ్విని ఉపాధ్యాయ్‌ అనే లాయర్, అడ్వొకేట్‌ అశ్వనీ దూబే  ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో కేంద్రం, న్యాయ  మంత్రిత్వ శాఖ, లా కమిషన్, నీతి ఆయోగ్‌లు ప్రతివాదులుగా ఉన్నారు. రాజ్యాంగంలోని 14 (సమానత్వపు హక్కు), 19 (వృత్తి చేసే హక్కు), 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా టీడీఎస్‌ ఉందని, ఈ వ్యవస్థ ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉందని ప్రకటించాలని పిల్‌ ద్వారా సుప్రీంకోర్టును కోరారు.

ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు

టీడీఎస్‌ అంటే ఏమిటి?

టీడీఎస్ అనేది ఆదాయ వనరు వద్దే పన్ను వసూలు చేసే పద్ధతి.. పేమెంట్ సమయంలోనే పన్నును మినహాయించి పన్ను చెల్లింపుదారు తరఫున ప్రభుత్వానికి పంపుతారు. జీతభత్యాలు, బ్యాంకుల ద్వారా వడ్డీ చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, కమీషన్ వంటి విభిన్న చెల్లింపులు చేసేప్పుడు టీడీఎస్‌ కట్‌ అవుతుంది.
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు