Breaking News

ఫోన్‌పేలో ‘పసిడి’ పొదుపు..

Published on Mon, 09/30/2024 - 15:15

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) 'డైలీ సేవింగ్స్' పేరుతో కొత్త ఉత్పత్తిని పరిచయం చేయనుంది. ఇందుకోసం మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ ‘జార్‌’తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది యూజర్లు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త ఉత్పత్తి కింద వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో రోజుకు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్థిరమైన పొదుపును అలవరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను కేవలం 45 సెకన్లలోపు క్రమబద్ధీకరించే జార్ ఇంటిగ్రేటెడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్‌ను ఫోన్‌పే 'డైలీ సేవింగ్స్' ఫీచర్‌కు జోడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇటీవలి కాలంలో తమ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ బంగారంపై యూజర్ల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదలను చూసినట్లు ఇన్‌యాప్ కేటగిరీస్‌, కన్స్యూమర్‌ పేమెంట్స్‌ హెడ్‌ నిహారిక సైగల్ చెప్పారు. ఇటీవల సూక్ష్మమైన, సురక్షితమైన డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్‌లకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు ఫోన్‌పే సైతం గుర్తించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 560 మిలియన్ల మందికి పైగా ఫోన్‌పే యూజర్లకు డిజిటల్‌ గోల్డ్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)