Breaking News

ఫోన్‌పే ఐపీవో బాట 

Published on Thu, 09/25/2025 - 04:54

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ కొటక్‌ మహీంద్రా క్యాపిటల్, జేపీమోర్గాన్‌ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్‌ స్టాన్లీని ఎంపిక చేసుకున్నట్లు జూన్‌లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 

కాగా.. గ్లోబల్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ గ్రూప్‌ సంస్థ 2023లో ఇన్వెస్టర్ల నుంచి 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్‌ డాలర్ల(రూ. లక్ష కోట్లు) విలువలో జనరల్‌ అట్లాంటిక్, వాల్‌మార్ట్, రిబ్బిట్‌ క్యాపిటల్, టైగర్‌ గ్లోబల్, టీవీఎస్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ తదితరాలు ఫోన్‌పేలో ఇన్వెస్ట్‌ చేశాయి. ఐపీవో ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశమున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

గతేడాది(2024–25) కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నష్టాలు తగ్గి రూ. 1,727 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ. 1,996 కోట్లుగా నమోదయ్యాయి. టోఫ్లర్‌ వివరాల ప్రకారం మొత్తం ఆదాయం 40 శాతంపైగా జంప్‌చేసి రూ. 7,115 కోట్లను తాకింది. 

డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్లతోపాటు కంపెనీ ఇన్సూరెన్స్, రుణాలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సర్వీసులు సైతం అందిస్తోంది. ఇటీవల కాలంలో గ్రో, ఫిజిక్స్‌వాలా, షాడోఫాక్స్‌ టెక్నాలజీస్, షిప్‌రాకెట్, బోట్, టాటా క్యాపిటల్‌ సైతం గోప్యతా మార్గంలోనే సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన విషయం విదితమే. గతేడాది(2024)లో స్విగ్గీ, విశాల్‌ మెగామార్ట్‌ ఇదే విధానంలో లిస్టింగ్‌కు వెళ్లడం గమనార్హం!  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)