Breaking News

ఏపీవైలో 50 లక్షల మంది స్వనిధి లబ్ధిదారులు

Published on Wed, 08/27/2025 - 07:48

అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకం కిందకు 50 లక్షల మంది ప్రధాన మంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులను చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్‌ ఎస్‌ రామన్‌ ప్రకటించారు. వీధి వర్తకుల కోసం ఉద్దేశించిన పీఎం స్వనిధి పథకం 2020 జూన్‌ 1న ప్రారంభమైంది. దీని కింద ఒక్కో లబ్ధిదారుడికి తనఖా అవసరం లేకుండా రూ.50వేల రుణ సాయం అందించనున్నారు.

ఈ పథకం విజయవంతమైందంటూ.. స్వనిధి పథకం 82 శాతం మంది ఇప్పటికే మొదటి విడత రుణాన్ని పొందడమే కాకుండా, తిరిగి చెల్లించినట్టు రామన్‌ చెప్పారు. గత మూడేళ్లలో అటల్‌ పెన్షన్‌ యోజన పథకం కింద కోటి మంది కొత్త సభ్యులు చేరినట్టు తెలిపారు. ఇందులో 2024–25లోనే 1.17 కోట్ల మంది సభ్యులైనట్టు వెల్లడించారు. ఇందులో 55% మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి ఏపీవై కింద 50 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు ప్రకటించారు.

పీఎం స్వనిధి

గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించడం దీని లక్ష్యం. దీని ద్వారా పట్టణ వీధి వ్యాపారులకు సాయం చేయాలని భావిస్తున్నారు.

రుణ బదిలీలు ఇలా..

  • రూ.10,000 (మొదటి విడత)

  • రూ.20,000 (రెండో విడత, మొదటి విడత తిరిగి చెల్లించిన తర్వాత)

  • రూ.50,000 (మూడో విడత, రెండో విడత చెల్లింపు తర్వాత)

  • వడ్డీ రాయితీ ఉంటుంది.

  • డిజిటల్ ప్రోత్సాహకాలు: యూపీఐ, డిజిటల్ లావాదేవీలకు రివార్డులు ఇస్తారు.

  • లోన్‌ ప్రాసెసింగ్ ఫీజు లేదు.

ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)