Breaking News

నెలకు కనీసం రూ.7,500 పెన్షన్‌ ఇవ్వండి

Published on Sun, 01/12/2025 - 04:19

న్యూఢిల్లీ: గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు కనీసం రూ.7,500 పెన్షన్‌ ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈపీఎస్‌–95 పెన్షనర్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై, నెలకు కనీసం రూ.7,500 పెన్షన్‌తో పాటు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) కోసం ఎప్పటి చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. 

రిటైర్మెంట్‌ ఫండ్‌ బాడీ ఈపీఎఫ్‌ఓ నిర్వహించే ఈపీఎస్‌–95 లేదా ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్‌ రూ.1,000 మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్‌–95 నేషనల్‌ అగిటేషన్‌ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించనున్నట్లు ఆర్థికమంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు,  ప్రైవేట్‌ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసిన  78 లక్షలకుపైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థికమంత్రికి వివరించినట్లు ఈపీఎస్‌–95 నేషనల్‌ అగిటేషన్‌ కమిటీ నేషనల్‌ ప్రెసిడెంట్‌  కమాండర్‌ అశోక్‌ రౌత్‌ తెలిపారు.  

రూ.5,000 డిమాండ్‌ సరికాదు.. 
కనీసం రూ.5,000 పెన్షన్‌ డిమాండ్‌ చేసే కొన్ని కారి్మక సంస్థలపై ఆయన విమర్శలు చేశారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు పట్టించుకోకపోవడమేనని, అన్యాయమైన ప్రతిపాదన అని అభిప్రాయపడ్డారు. ‘‘గౌరవమైన జీవితం కోసం కనీసం రూ.7,500 అవసరం,‘ అని ఆయన స్పష్టం చేశారు.

హామీ ఇచ్చారు.. నెరవేర్చాలి..! 
నెలకు రూ.1,000 పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని,  డీఏతో పాటు పె న్షనర్, వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని  పెన్షనర్లు  గత 7–8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్‌ అశోక్‌ రౌత్‌ ప్రస్తావించారు.  ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తోంది.  కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జె ట్‌లో కనీసం రూ.7,500 పెన్షన్‌ను డీఏతో ప్రకటించాలి’ అన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)