Breaking News

కారంపొడిలో కలుషితాలు.. ఆ బ్యాచ్‌లో తయారైన ప్యాకెట్లు వెనక్కి..

Published on Thu, 01/23/2025 - 22:00

బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ఎఫ్‌ఎంసీజీ (FMCG) సంస్థ పతంజలి ఫుడ్స్‌కు (Patanjali Foods) గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా ఒక బ్యాచ్‌లో తయారైన మొత్తం ఎర్ర కారం పొడి ప్యాకెట్లను (chilli powder) రీకాల్ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదేశించినట్లు పతంజలి ఫుడ్స్‌ తాజాగా ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది.

"ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 జనవరి 13 నాటి (2025 జనవరి 16న అందింది) ఆర్డర్ ప్రకారం బ్యాచ్ నెంబర్‌ AJD2400012 లో తయారైన పదార్థాలు (ఎర్ర కారం పొడి పాకెట్లు) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (కలుషితాలు, టాక్సిన్స్, అవశేషాలు) నిబంధనలు, 2011కి అనుగుణంగా లేనందున మొత్తం బ్యాచ్‌ను రీకాల్ చేయమని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌ని ఆదేశించిందని  తెలియజేస్తున్నాం" ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

పతంజలి ఫుడ్స్ షేర్లు గురువారం (జనవరి 23) బీఎస్‌ఈలో దాదాపు అర శాతం తగ్గి రూ.1,855.30 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఎఫ్‌ఎంసీజీ స్టాక్‌పై సంవత్సర కాలంలో రాబడి దాదాపు 19 శాతం. పతంజలి ఫుడ్స్‌ గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్‌గా ఉండేది. 2019 డిసెంబర్‌లో రూ. 4,300 కోట్లకు పైగా వెచ్చించి బాబా రామ్‌దేవ్ కొనుగోలు చేశారు. గోధుమ  పిండి నుండి నూనెలు, డెయిరీ.. పలు విభిన్న ఉత్పత్తులను ఎఫ్‌ఎంసీజీ సంస్థ విక్రయిస్తోంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)