Breaking News

‘పాస్‌వర్డ్‌ సరైందే! ఎందుకు లాగిన్‌ అవ్వట్లేదు’

Published on Mon, 07/07/2025 - 14:50

బ్యాంక్‌, ఆఫీస్‌ పోర్టళ్లు, జాబ్‌ కోసం దరఖాస్తులు వంటి ఇతర ముఖ్యమైన వెబ్‌సైట్‌ల్లో చాలామంది లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు కొత్తగా క్రియేట్‌ చేసుకుంటుంటారు. కానీ తిరిగి లాగిన్‌ చేయాలంటే మాత్రం సైన్‌ఇన్‌ ఇవ్వొదు. ‘అదేంటి సరిగ్గానే పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తున్నానే.. ఎందుకు అవ్వట్లేదు’ అనే అనుమానం వస్తుంది. దాంతో తిరికి ఫర్‌గాట్‌ పాస్ట్‌వర్డ్‌ అప్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ కొన్ని సైట్లు పాత పాస్‌వర్డ్‌లు ఎంటర్‌ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.

ఏవీ చూసుకోకుండా లాగిన్‌ చేస్తే..

లాగిన్‌ పోర్టల్‌లో ఐడీ ఎంటర్‌ చేసేప్పుడు సదరు బ్లాక్‌లో ఎంటర్‌ చేసే అక్షరాలు యూజర్‌కు కనిపిస్తాయి. కానీ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసేప్పుడు మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల డాట్‌లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్‌కేస్‌, లోయర్‌ కేస్‌ ఇంగ్లీష్‌ అక్షరాలు, స్పెషల్‌ క్యారెక్టర్లు, క్యాప్స్‌లాక్‌ ఆన్ అవుతుంది. అవేవీ చూసుకోకుండా లాగిన్‌ చేస్తే అప్పటివరకు లాగిన్‌ అవుతుంది. కానీ లాగవుట్‌ చేసి తిరిగి లాగిన్‌ చేస్తే సైన్‌ఇన్‌ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

చెక్‌ చేయాల్సిందే..

ఆన్‌లైన్‌లో ఖాతాలు ఓపెన్‌ చేసేప్పుడు లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు టైప్‌ చేయాల్సి వస్తుంది. ఐడీ బ్లాక్‌లో అక్షరాలు యూజర్‌కు కనిపిస్తాయి. కానీ పాస్‌వర్డ్‌ బ్లాక్‌లో ఎంటర్‌ చేసే అక్షరాలు కనిపించవు. బదులుగా డాట్స్‌ పడుతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ కంప్యూటర్‌ ద్వారా సైన్‌ఇన్‌ అవుతుంటే నోట్‌పాడ్‌ ఓపెన్‌ చేసి అందులో ముందుగా పాస్‌వర్డ్‌ టైప్‌చేసి, ఎంటర్‌ చేయాల్సిన అన్ని అక్షరాలు సరిగ్గా పడుతున్నాయా? లేదా ఏదైనా బటన్‌ సమస్యలు, లేదా కేస్‌ సెన్సిటివ్‌ అక్షరాలు టైప్‌ అవుతున్నాయా చెక్‌ చేసుకోవాలి. తర్వాత పాస్‌వర్డ్‌ బ్లాక్‌లో ఎంటర్‌ చేయడంతో సమస్య ఉండదు.

ఇదీ చదవండి: ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?

మొబైల్‌లో ఇలా..

మొబైల్‌లో సైనప్‌ అవుతుంటే మాత్రం నోట్స్‌లో రాసుకోవచ్చు. దాంతోపాటు వెర్టికల్‌ వ్యూలో అక్షరాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక అక్షరం నొక్కితే పక్కన ఉన్న లెటర్లు ప్రెస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పరిష్కారంగా మొబైల్‌లో స్క్రీన్‌ రొటేట్‌ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఫోన్‌ రొటేట్‌ చేస్తే కీబోర్డ్‌ పెద్దగా కనిపిస్తుంది. మరింత స్పష్టంగా, ఎంటర్‌ చేయాలనుకునే పాస్‌వర్డ్‌ సదరు బ్లాక్‌లో ఇవ్వొచ్చు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు