Breaking News

ఉగ్రదేశంలో ఇంధన సెగ

Published on Mon, 03/23/2026 - 13:13

తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్‌ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్‌ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్థిక క్రమబద్ధీకరణ

ప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్‌) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే హెచ్‌ఓబీసీ ఫ్యుయెల్‌లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..

ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)
పెట్రోల్రూ. 266.17రూ. 321.17
డీజిల్రూ. 280.86రూ. 335.86

 

విమాన ప్రయాణికులకు షాక్

ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్‌లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.

ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?

Videos

నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..

మళ్ళీ ట్రాక్ తప్పుతోన్న ప్రభాస్..

లంచం తీసుకుంటూ దొరికిన లాజిస్టిక్స్ మేనేజర్

మల్లారెడ్డి.. కబడ్డీ, కబడ్డీ

పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..

రంగస్థలం 2 కి రంగం సిద్ధం

ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!

విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ

మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..

న్యూయార్క్ సిటీలో ఘోర విమాన ప్రమాదం

Photos

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)