Breaking News

భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్‌ - కారణం ఇదే!

Published on Thu, 12/21/2023 - 15:41

Pakistan Car Sales: భారతీయ మార్కెట్లో ప్రతి నెలా మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన ఆటోమొబైల్ మార్కెట్.. పాకిస్తాన్‌లో బాగా క్షీణించి.. గత నెలలో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎమ్ఏ (PAMA) వెల్లడించింది. అక్కడ కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

పాకిస్తాన్‌ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం.. పాకిస్తాన్‌లో నవంబర్ 2023లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం.

పాకిస్తాన్‌లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గడానికి కారణం 'పెరిగిన ఆర్థిక సంక్షోభం, తారా స్థాయికి చేరిన కార్ల ధరలు, సగటు వ్యక్తి సంపాదన క్షీణించడం' మాత్రమే కాకుండా పరిశ్రమ డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు, ఆటో ఫైనాన్సింగ్ వంటివి ఖరీదైనవి కావడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.

నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఈ కారణంగానే పాకిస్తాన్‌లో ఆటోమొబైల్ మార్కెట్ బాగా క్షీణించింది. పాక్ సుజుకి, ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలు వరుసగా 72 శాతం, 71 శాతం, 49 శాతం క్షీణించాయి. మరి కొన్ని సంస్థలు పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి.

2023 జులై నుంచి అక్టోబర్ వరకు పాకిస్తాన్‌లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 20,871. అంటే నాలుగు నెలల కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్య సగటున ఐదు వేలు మాత్రమే అని స్పష్టమవుతోంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.

ఇదీ చదవండి: బాలీవుడ్‌ రిచ్‌ మ్యాన్‌.. స్టార్‌ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ!

భారతీయ మార్కెట్లో అమ్మకాలు
పాకిస్తాన్‌లో కార్ల అమ్మకాలను పక్కన పెడితే.. భారతదేశంలో కార్ల విక్రయాలు గత నెలలో జోరుగా సాగాయి. నవంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ.

పాకిస్తాన్‌లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది. భారతదేశంలోని ద్విచక్ర వాహన తయారీదారులు నవంబర్‌లో తమ ఫోర్ వీలర్ కౌంటర్‌పార్ట్‌లను అధిగమించారు. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్' (FADA) గణాంకాల ప్రకారం నవంబర్‌లో ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)