Breaking News

పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన

Published on Fri, 04/25/2025 - 14:55

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి.. త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది.

"పహల్గాంలో అమాయక పౌరుల మరణం పట్ల ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా అండగా నిలుస్తుంది" అని ఎల్‌ఐసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉందని క్లెయిమ్‌దారులు తప్పకుండా గమనించాలి. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలి. పాలసీ ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించి ఉంటే లేదా గ్రేస్ పీరియడ్‌లోపు మరణం సంభవించినట్లయితే క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు అర్హత ఉంటుంది.

క్లెయిమ్ ప్రాసెస్
➤నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలి.
➤పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.
➤నామినీదారునికి, మరణించిన వ్యక్తికి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఫారమ్ Aను సబ్మిట్ చేయాలి.
➤అధికారిక మరణ ధ్రువీకరణ పత్రంగా.. స్థానిక మరణ రిజిస్టర్ నుంచి ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.
➤మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీదారు మరణించినట్లు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ఏవైనా ఆధారాలు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ఏదైనా పరిహారం వంటివి పాలసీదారు మరణించినట్లు నిర్దారించడానికి ఉపయోగపడతాయి.
➤వీటన్నింటినీ.. పరిశీలించి ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది.

ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)