Breaking News

ఓయో ఫౌండర్‌ రితేష్‌ అగర్వాల్‌ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు!

Published on Sun, 03/05/2023 - 15:22

దేశీయ హాస్పెటాలిటీ చెయిన్‌ ఓయోను స్థాపించిన రితేష్‌ అగర్వాల్‌ పెళ్లి మార్చి 7న ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ విలాసవంతమైన వివాహానికి అత్యంత ప్రముఖులు చాలా మందినే ఆహ్వానించారు. పెళ్లికి ప్రముఖులు ఎవవరెవరు హాజరవుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

రితేష్‌ అగర్వాల్ ఇటీవల తన తల్లి, కాబోయే భార్యతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని  పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓయో బిజినెస్ కి సహకారం అందించిన ఎయిర్ బీఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఉన్నట్లు సమాచారం.

అగర్వాల్‌ పెళ్లికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ హాజరవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక చెబుతోంది. ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

చదవండి: Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్‌! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు.. 

రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడ్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం అక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. థీల్ ఫెల్లోషిప్‌లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013లో ఓయో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారం అనతికాలంలోనే భారీగా విజయవంతమైంది. ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్.. తన పెళ్లికి ఇప్పుడు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, ప్రముఖులు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగారు.

చదవండి: Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్‌ లేదు!

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)