Breaking News

ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్‌

Published on Sat, 05/03/2025 - 13:21

గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్‌ ముందంజలో నిలిచింది. గ్రేటర్‌లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరో

మార్చితో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాలలో 4,06,889 యూనిట్లు డెలివరీ అయ్యాయని ప్రాప్‌ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)లో డెలివరీ అయిన 3,06,600 యూనిట్లతో పోలిస్తే ఏడాది కాలంలో డెలివరీలో 33 శాతం వృద్ధి నమోదైంది. గడువులోగా గృహాల అందజేతలో అత్యధికంగా పశ్చిమాది నగరాల వాటా 55 శాతంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గడువులోగా కస్టమర్లకు అందజేశారు.  

ఒక్క ఢిల్లీలోనే క్షీణత.. 
గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ వెనకబడి ఉంది. 2023–24 ఫైనాన్షియల్‌ ఇయర్‌తో పోలిస్తే 2024–25లో ఈ నగరంలో యూనిట్ల డెలివరీలో 8 శాతం క్షీణత నమోదైంది. అత్యధికంగా కోల్‌కతాలో, అత్యల్పంగా ముంబైలో గృహాలు డెలివరీ అయ్యాయి. ఏడాది కాలంలో కోల్‌కతాలో 88 శాతం, ముంబైలో 22 శాతం వృద్ధి నమోదైంది.  

డెలివరీలో వేగవంతం.. 
2018–19 మధ్య కాలంలో లాంచింగ్‌ అయిన ప్రాజెక్ట్‌లు 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ దశకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో లాక్‌డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, కార్మికుల వలసలు తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేళ్లుగా సానుకూల మార్కెట్‌ సెంటిమెంట్లు, నగదు ప్రవాహం పెరగడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు స్పెషల్‌ విండో ఫర్‌ అఫర్డబుల్‌ అండ్‌ మిడ్‌ ఇన్‌కం హౌసింగ్‌(ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్‌) ఫండ్‌ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో పాటు రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్‌ డెలివరీపై దృష్టిసారించారు. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు గృహాల డెలివరీ పెరిగాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)