Breaking News

లండన్‌లో ఓపెన్‌ఏఐ శాశ్వత కార్యాలయం

Published on Mon, 04/13/2026 - 16:42

ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ బ్రిటన్ రాజధాని లండన్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. యూకేలో తన మొట్టమొదటి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 500 మంది సభ్యుల సామర్థ్యంతో కూడిన ఈ కార్యాలయం కోసం సోమవారం లీజు ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.

కీలక కేంద్రంగా లండన్..

లండన్‌లోని ప్రముఖ ‘కింగ్స్‌ క్రాస్’ ప్రాంతంలో సుమారు 88,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన కార్యాలయం ఏర్పాటు కానుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటా, సింథెసియా, వేవ్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలకు ఈ ప్రాంతం ఇప్పటికే నిలయంగా ఉంది. ‘యూకేలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏఐ రంగంలో బ్రిటన్‌కు బలమైన చరిత్ర ఉంది’ అని ఓపెన్‌ఏఐ లండన్ సైట్ లీడ్ ఫోబ్ థాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్‌లో 200 మంది ఉద్యోగులు ఉండగా, అమెరికా వెలుపల తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రంగా లండన్‌ను తీర్చిదిద్దుతామని కంపెనీ గతంలోనే వెల్లడించింది.

స్టార్ గేట్ ప్రాజెక్ట్‌కు బ్రేక్.. కారణం అదేనా?

ఒకవైపు కార్యాలయ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరోవైపు మౌలిక సదుపాయాల విషయంలో యూకేకు కొంత నిరాశ ఎదురైంది. భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయిన ‘స్టార్ గేట్’ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే పారిశ్రామిక ఇంధన ధరలు యూకేలో అత్యధికంగా ఉండటం, విద్యుత్ గ్రిడ్‌ను యాక్సెస్ చేయడంలో జరుగుతున్న జాప్యం, లండన్‌లోని కఠినమైన నిబంధనలు కూడా ప్రాజెక్ట్ పురోగతికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ భాగస్వామి అయిన ‘ఎన్ స్కేల్’తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.

ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)