Breaking News

దశాబ్దాల చిక్కుముడులు విప్పిన ‘అస్ట్రా’!

Published on Mon, 08/03/2026 - 11:28

కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు కోడింగ్, స్క్రిప్ట్‌ పరిధిని దాటి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనల వైపు మళ్లింది. దశాబ్దాలుగా ప్రపంచ గణిత మేధావులకు కూడా సవాలుగా నిలిచిన 10 సంక్లిష్టమైన ఓపెన్ మాథ్స్ సమస్యలను తమ తదుపరి తరం మోడల్ అస్ట్రా (Astra) పూర్తిస్థాయిలో సాధించిందని ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే పోటీ సంస్థ ఆంత్రోపిక్ స్పందిస్తూ తమ ‘క్లాడ్ ఫేబుల్’ మోడల్ ద్వారా వాటిలో ఐదు సమస్యలను కేవలం 24 గంటల్లోనే పరిష్కరించామని ప్రకటించి ఏఐ రేసును మరింత వేడెక్కించింది.

ఓపెన్-ఏఐ ప్రచురించిన 249 పేజీల సమగ్ర నివేదిక ప్రకారం.. ‘అస్ట్రా’ మోడల్ గ్రూప్ థియరీ, క్వాంటమ్ కాంప్లెక్సిటీ, ఎక్స్‌ట్రీమల్ కాంబినేటోరిక్స్, స్పియర్ ప్యాకింగ్ డెన్సిటీ వంటి విభాగాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కాని 10 సమస్యలను ఛేదించింది.

  • 1999లో మిఖాయిల్ గ్రోమోవ్ ప్రతిపాదించిన 'నాన్-సోఫిక్ గ్రూప్స్' ఉనికిని నిరూపించడంతో పాటు 'కానెస్ రిజిడిటీ కాంజెక్షన్'ను తిరస్కరించింది.

  • ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోస్ ప్రతిపాదించిన సమస్యలకు స్పష్టమైన ఆధారాలు అందించింది.

  • కంప్యూటర్ల ద్వారా లైన్-బై-లైన్ తనిఖీ చేయగల లీన్‌ 4 (Lean 4) డిజిటల్ సర్టిఫికేట్లతో సహా ఈ పరిష్కారాలను గిట్‌హబ్‌లో అందుబాటులో ఉంచారు.

  • ఈ మొత్తం ప్రక్రియకు అయిన టోకెన్ కంప్యూటింగ్ వ్యయం కేవలం 2,000 డాలర్లు (సుమారు రూ.1.9 లక్షలు) కావడం గమనార్హం.

ధీటుగా ఆంత్రోపిక్ సవాలు

ఓపెన్-ఏఐ నివేదికపై ఆంత్రోపిక్ రీసెర్చర్ లీవెంట్ అల్పోజ్ స్పందిస్తూ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ క్లాడ్ ఫేబుల్ మోడల్ ఎటువంటి ఇంటర్నెట్ సహాయం లేకుండా స్వయంప్రతిపత్తితో ఆ 10 సమస్యల్లో ఐదు సమస్యలను 24 గంటల్లోనే ఛేదించిందని సోషల్ మీడియాలో ఆధారాలు ప్రదర్శించారు.

మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమనుకున్న అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ సామర్థ్యాన్ని పొందే దిశగా ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్లు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ గణిత సమాజం ఈ ఆధారాలను పీర్-రివ్యూ ద్వారా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సాంకేతిక దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ సైంటిఫిక్ పోటీ భవిష్యత్ పరిశోధనల వేగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట..

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)