Breaking News

ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!

Published on Fri, 10/24/2025 - 19:15

బంగారం ధరలు భారీగా పెరిగి.. వారం రోజుల నుంచి కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ 22న.. ఒకేరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 4690 తగ్గింది. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో పసిడి ధరలు రూ.1,24,370 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ.1,14,000 (22 క్యారెట్స్ 10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గాలంటే.. ఎలాంటి పరిణామాలు జరగాలనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు.

గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా తగ్గాలంటే.. యుద్దాలు ఆగాలి, అమెరికా విధించిన సుంకాలు తగ్గాలి, ఆర్థికాభివృద్ధి పెరిగినప్పుడే.. బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని.. టాటా అసెట్ మేనేజ్‌మెంట్ కమొడిటీస్ ఫండ్ మేనేజర్ 'తపన్‌ పటేల్' తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వారం బంగారం ధరలు 3 శాతం తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలో మాత్రమే ధరల పతనం నమోదైంది. దీంతో గోల్డ్ రేటు ఔన్సుకు 4118.68 డాలర్ల వద్దకు చేరుకుంది.

బంగారం పెరగడానికి కారణాలు
గోల్డ్ రేటు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడం అని తెలుస్తోంది. డిమాండ్ పెరగడానికి కారణం.. పెట్టుబడిదారుల గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే. బంగారం సురక్షితమైన పెట్టుబడి, కాబట్టి దీనిపై పెట్టుబడులు పెరిగాయి. ఇవి కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.

ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)