Breaking News

మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్‌ మీడియాలో ఫోటో వైరల్‌

Published on Thu, 07/20/2023 - 15:23

Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి ఒక  వివాదం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేసి, ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న  ఓలా ఎలక్ట్రిక్‌పై తాజాగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, బ్యాటరీ చార్జింగ్‌, క్వాలిటీ  దుమారం   మరోసారి వెలుగులోకి వచ్చింది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం)

20 శాతం చార్జ్‌కాగానే ఆగిపోతోందంటూ ఓలా S1 స్కూటర్  వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ సమస్యలను పరిష్కరించడంలో ఓలా టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంబంధిత  కస్టమర్ సర్వీస్ సెంటర్ ముందు ఒక బ్యానర్‌తో సహా   స్కూటర్‌ను నిలిపాడు. ఏడాది కాలంగా స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాను..ఈ స్కూటర్‌ను వదిలి వెళ్లినప్పటి నుంచి తనకు సర్వీస్ సెంటర్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని పేర్కొన్నాడు. అలాగే  స్కూటర్‌లోని అలైన్‌మెంట్ బుష్ ఐదుసార్లు మార్చానని కూడా పేర్కొన్నాడు. (సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయిలో మార్కెట్‌ దూకుడు.. తగ్గేదేలే!)

దీనికి సంబంధించి ఫొటోను ఓలా ఎలక్ట్రిక్ పేరడీ  అనే ట్విటర్‌ ఖాతాలో ఇది పోస్టు అయింది.  ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకాదు.. ఇదో అధ్వాన్నమైన సర్వీస్ సెంటర్  అని కమెంట్‌ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ పోస్ట్ క్రింద, తమ కెదురైన అనుభవాలను ఓలా స్కూటర్ కస్టమర్‌లు ఫోటోలు షేర్‌ చేయడం గమనార్హం.  ఓలాను స్కామ్ కంపెనీ అని మరొకరు  పేర్కొన్నారు. అయితే దీనిపై ఓలా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు  కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం వివరాలను కోరినట్టు తెలుస్తోంది.

అయితే ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇదే తొలిసారి కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందో అంతే విమర్శలను  కూడా  ఎదుర్కొంది. గతంలో ఓలా S1 స్కూటర్లపై కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో  ఈ స్కూటర్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)