Breaking News

ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి

Published on Mon, 06/19/2023 - 18:58

Ola Cabs Co-Founder Ankit Bhati: ఓలా క్యాబ్ సర్వీస్ అనగానే భవిష్ అగర్వాల్ గుర్తుకు వస్తారు. అయితే దీని స్థాపించడంలో మరొక వ్యక్తి హస్తం కూడా ఉంది. అతడే ఓలా క్యాబ్ సర్వీస్ కో ఫౌండర్ 'అంకిత్ భాటి' (Ankit Bhati). అతి తక్కువ వయసులోనే బిలీనియర్ అయిన ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటికే మనం ఐఐటీ చేసిన గ్రాడ్యుయేట్లు దేశంలో అనేక వ్యాపారాలు చేసి సక్సెస్ సాధించారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు అంకిత్ భాటి. దేశంలోని అతిపెద్ద స్టార్టప్ కంపెనీ స్థాపనలో పాలుపంచుకుని విజయం సాధించిన అంకిత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఇతడు మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ కోడింగ్‌లో నిపుణుడు. ఓలా క్యాబ్ సర్వీస్ ప్రారంభించడానికి ముందు మైక్రోసాఫ్ట్, మేక్ సెన్స్, విల్కామ్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు.

2010లో ఓలా క్యాబ్స్ ప్రారంభమైంది. ఇది కేవలం ఐదు సంవత్సరాల నాటికి వేలకోట్లు టర్నోవర్ తీసుకువచ్చింది. ఈ కారణంగానే భవిష్ అండ్ అంకిత్ ఇద్దరూ కూడా అతి తక్కువ కాలంలో బిలీనియర్స్ అయిన యువకుల జాబితాలో స్థానం పొందారు.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్‌ మరొకటి లేదు!)

ఎనిమిది సంవత్సరాల ముందు అంకిత్ నికర విలువ సుమారు రూ. 3000 కోట్లు అని నివేదికల ద్వారా తెలిసింది. కాగా ఇప్పుడది రూ. 938 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. ప్రస్తుతం ఉబర్ సంస్థకు గట్టి పోటీ ఇస్తున్న ఓలా క్యాబ్ సర్వీస్ మంచి లాభాల బాటలో పయనిస్తోంది. సంస్థ సీఈఓగా భవిష్, సిటీఓగా (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) అంకిత్ ఉన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)