Breaking News

సరికొత్త రోర్ లాంచ్: ధర రూ.లక్ష!

Published on Fri, 05/01/2026 - 18:10

ప్రముఖ స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన ఓబెన్ ఎలక్ట్రిక్.. సరికొత్త రోర్ ఈవీఓ లాంచ్ చేసింది. మొదటి 10,000 మంది కస్టమర్లు దీనిని రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. తరువాత దీని ధర రూ. 1,24,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

కేవలం రూ. 777తో బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, దేశవ్యాప్తంగా ఉన్న 150 షోరూమ్‌లలో టెస్ట్ రైడ్‌లు, కస్టమర్ డెలివరీలు జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. మంచి డిజైన్ కలిగిన ఈ ఓబెన్ రోర్ ఈవీఓ ముందు భాగంలో సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది.

రోర్ ఈవీఓ గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ రేంజ్ 180 కిమీ (సింగిల్ ఛార్జ్). రియల్ వరల్డ్ రేంజ్ కొంత తక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 90 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ అవుతుంది. రోజువారీ ఛార్జింగ్ కోసం ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉపయోగపడుతుంది.

ఈ మోటార్‌సైకిల్‌కు IP68-రేటెడ్ మోటార్ శక్తిని అందిస్తుంది. రోర్ ఈవీఓలో ఓబెన్ వారి సొంత 3.4 kWh అధిక-పనితీరు గల LFP బ్యాటరీని అమర్చారు. ఇది సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే 50% అధిక ఉష్ణ నిరోధకతను కలిగి ఉండటమే కాకుండా.. రెండు రెట్లు జీవితకాలాన్ని అందిస్తుంది.

ఇదీ చదవండి: బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!

రోర్ ఈవీఓ 5 ఇంచెస్ కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్‌లను అందిస్తుంది. Oben Electric యాప్ ద్వారా, రైడర్‌లు రైడ్ హిస్టరీ, జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, 'ఫైండ్ మై Rorr', 24x7 సర్వీస్ సపోర్ట్‌ను పొందవచ్చు. దీనితో పాటు 68,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ కూడా లభిస్తుంది.

Videos

ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు

వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?

పాలకొల్లులో అరుదైన ఘటన.. పది ఫలితాల్లో తల్లీకొడుకులు ఒకే సారి పాస్

ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..

భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త

బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమ..?

ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ

వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

EVMల టాంపరింగ్.. బెంగాల్లో షాకింగ్ వీడియో

Photos

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)