YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల
Breaking News
ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.35,000 వరకు ఆఫర్
Published on Sat, 09/13/2025 - 08:29
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ‘మెగా ఫెస్టివ్ ఉత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోటారు సైకిళ్లు రోర్ ఈజెడ్ సిగ్మా, రోర్ ఈజెడ్ కొనగోళ్లపై క్యాష్ బ్యాక్‌లు ప్రకటించింది.
రోర్ ఈజెడ్ సిగ్మా లేదా రోర్ ఈజెడ్‌లను రూ.20,000 వరకు ధర తగ్గించి విక్రయిస్తున్నట్టు, దీనికితోడు రూ.10,000 క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే ప్రతీ కొనుగోలుపై బంగారం కాయిన్‌ను ఇస్తున్నట్టు తెలిపింది. అలాగే లక్కీ డ్రాలో ఐఫోన్‌ను సైతం గెలుచుకోవచ్చని పేర్కొంది. తమ మోటారు సైకిళ్ల పనితీరును తెలుసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ అసాధారణ విలువతో మెగా ఫెస్టివ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం!
Tags : 1