Breaking News

ఎన్విడియా సీఈఓ నోట.. తోటమాలి నేర్పిన పాఠం

Published on Thu, 06/20/2024 - 19:19

మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రకృతి కూడా మనకు ఎన్నెన్నో జీవిత సత్యాలను చెబుతుంది. నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. జీవితంలో ఎంతోమందికి ఆదర్శమైన వారు కూడా తమకంటే ఉన్నతులు లేదా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఇటీవల ఎన్వీడియా సీఈఓ 'జెన్‌సన్ హువాంగ్' (Jensen Huang) ఓ తోటమాలి నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని వెల్లడించారు.

జెన్‌సన్ హువాంగ్ గత వారం కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడ ప్రసంగిస్తూ.. జపాన్‌లోని క్యోటోలో తాను సిల్వర్ టెంపుల్ సందర్శించడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఎక్కువ ఎండగా ఉంది, ఆ ఎండలో కూడా ఓ తోటమాలి అక్కడ పనిచేస్తూ కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను, ఆయన ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాను. ఈ తోటకు 25 సంవత్సరాలుగా తోటమాలిగా పని చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.

తోట పెద్దదిగా ఉంది పని చేయడానికి సాధ్యమవుతుందా అని నేను అడిగినప్పుడు.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనులను సమయం కేటాయిస్తాను అని పేర్కొన్నట్లు జెన్‌సన్ చెప్పారు. ఆ తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలను నేర్పినట్లు చెప్పుకొచ్చారు.

మనకు జీవితంలో ఎన్నెన్నో పనులు, వాటికి ఎన్నెన్నో ఆటంకాలు. అవన్నింటిని చూసి భయపడవకూడదు, అన్నీ చేయాల్సిన అవసరమూ లేదు. నీకు జీవితంలో ఏదైతే ముఖ్యమైందో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో దానికి సమయాన్ని కేటాయించు. సమయం మిగిలి ఉంటే మిగిలిన పనులు చెయ్యి. తప్పకుండా సక్సెస్ సాధిస్తావన్నని ఆ తోటమాలి మాటలకు అర్థమని స్పష్టంగా తెలుస్తోంది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు