గర్ల్‌ఫ్రెండ్‌కు మాటిచ్చి! ‘సీఈవో’గానే మనువాడి..

Published on Wed, 11/27/2024 - 17:32

ఎన్‌వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈయన ఇటీవల హాంగ్ కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో తన భార్య 'లోరీ హువాంగ్‌'ను ఎలా ఆకట్టుకున్నారనే విషయాలను వెల్లడించారు.

జెన్సన్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో మొదటిసారి లోరీని కలుసుకున్నప్పుడు ఆమెను ఆకట్టుకోవడానికి.. ఆమె వద్దకు వెళ్లి, మీరు నా హోంవర్క్ చూడాలనుకుంటున్నారా?.. అని అడిగినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే.. తప్పకుండా మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు, అని వాగ్దానం చేశారు. నిజానికి అప్పుడు హువాంగ్ వయస్సు కేవలం 17, లోరీ వయస్సు 19 సంవత్సరాలు.

జెన్సన్ హువాంగ్ మాటలు విన్న లోరీ.. అతన్ని తెలివైనవాడిగా భావించిందని, ఆ తరువాత ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు.. నేను 30 ఏళ్ల వయసుకే సీఈఓ అవుతానని జెన్సన్ చెప్పినట్లు వెల్లడించారు. చెప్పినట్లుగానే సీఈఓ అయ్యాను, దీంతో లోరీకి నమ్మకం కుదిరింది.

సీఈఓ అయిన తరువాత ఐదేళ్లకు లోరిని పెళ్లి చేసుకున్నట్లు జెన్సన్ తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు మాడిసన్ (ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్‌), కుమారుడు స్పెన్సర్ (ఎన్విడియాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌). ప్రస్తుతం జెన్సన్ హువాంగ్ నికర విలువ రూ. 9 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)