Breaking News

మహిళలకు ఆర్థిక శక్తి.. ఎన్ఎస్ఈ, తెలంగాణ వి హబ్ ఒప్పందం

Published on Wed, 05/28/2025 - 18:45

ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), తెలంగాణ ప్రభుత్వ చొరవ కార్యక్రమం వి హబ్ ఫౌండేషన్‌ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, నిధుల సమీకరణలో మహిళా పారిశ్రామిక వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సీతక్క సమక్షంలో  హైదరాబాద్‌లో ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్, వి హబ్ ఫౌండేషన్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.  మధ్య జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా  తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వి హబ్ ఫౌండేషన్‌ తో కలిసి ఎన్ఎస్ఈ మదుపరుల అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. మహిళల నేతృత్వంలోని పరిశ్రమలకు నిధుల సమీకరణ, లిస్టింగ్ ప్రక్రియలో మార్గనిర్దేశం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తుంది.

2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఎన్ఎస్ఈ 36 రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలలో 14 భాషలలో 14,679 మదుపరుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. వీటి ద్వారా 8 లక్షలకు పైగా పెట్టుబడి కార్యకలాపాల్లో పాల్గొనేవారు చేరారు. స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద వివిధ రాష్ట్రాలలో 7500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. అలాగే, వివిధ రంగాలకు చెందిన 615 కంపెనీలు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్‌ అ‍య్యాయి. సమిష్టిగా రూ. 17,083 కోట్లకుపైగా నిధులు సమీకరించాయి.  ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1,80,000 కోట్లు.

 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)