Breaking News

ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు

Published on Fri, 08/09/2024 - 05:39

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్‌ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్‌లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్‌ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్‌ 8) యూనిక్‌ రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్‌) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్‌ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం.  

25ఏళ్లు.. 
నిజానికి ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్‌ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్‌ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్‌ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్‌ఎస్‌ఈ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)